తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి అన్నపూర్ణమ్మ రాజీనామా చేయగా…ప్రాథమిక సభ్యత్వానికి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి పదవికి డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసించడం లేదని రాజీనామా చేసిన సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో అన్నపూర్ణమ్మ తెలిపారు. సమకాలీన రాజకీయాలలో కొనసాగాలంటే కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుకూలంగా వ్యవహరించాలని పేర్కొంటూ…టీడీపీకి గుడ్ బై చెప్పామని వెల్లడించారు. ఉన్న అతికొద్దిమంది నేతల్లో ఒకరైన అన్నపూర్ణమ్మ సైతం రాజీనామా చేయడం ఆ పార్టీకి దిక్కులేని పరిస్థితిని చాటిచెప్తోందని అంటున్నారు.
