తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా జోరుమీదుంది. టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా 2018 ముందస్తు ఎన్నికల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ విస్తృతంగా ప్రచారం చేసి టీఆర్‌ఎస్ పార్టీ విజయానికి దోహదపడింది. తాజాగా2020 మున్సిపల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా సోషల్ మీడియా ద్వారానే కాకుండా ప్రత్యక్ష ప్రచారములో కూడా పాల్గొంది , అన్ని మున్సిపాలిటీలల్లో తమ మెంబెర్స్ ప్రచారములో పాల్గొనేట్టు ప్రణాలికను రచించినట్టు టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు. ప్రచారములో భాగంగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి పథకం, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డకు లక్షా 116 రూపాయలు అందజేయడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటికి సురక్షిత తాగునీరు, మిషన్ కాకతీయతోపాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాల ప్రాధాన్యతను టీఆర్‌ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా విభాగం సభ్యులు ప్రజలకు వివరించినారు . నాగరాజు గుర్రాల దరువు తో మాట్లాడుతూ పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.సోషల్ మీడియా ద్వారా ప్రచారములో పాల్గొన్న సౌత్ ఆఫ్రికా సభ్యులు అందరిని అభినందిచారు , ప్రత్యక్ష ప్రచారములో పాల్గొన్న టీఆర్ఎస్ ఎన్నారై సభ్యులు వెంకట్రావు తాళ్లపల్లి , అరవింద్ చోకోటి, విష్ణు జై గుండా, సాయి కిరణ్ నల్ల , శ్రీనివాస్ రెపాల, నవదీప్ రెడ్డి గుడిపాటి , అనిల్ గుడిపాటి ని నాగరాజు గుర్రాల అభినందిచారు . సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తాయని నాగరాజు గుర్రాల చెప్పారు, టీఆర్‌ఎస్ ఎన్నారై సలహాదారు కవిత, ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ సారథ్యంలో టీఆర్‌ఎస్ ఎన్నారైల ఐక్యమత్యం రోజురోజుకి పటిష్టమౌతుందన్నారు. శాసనసభ ఎన్నికల్లో టెలిఫోన్ క్యాంపైన్, మన ఎమ్మెల్యే క్యాంపైన్, సోషల్ మీడియా క్యాంపైన్, ఇంటింటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ విజయానికి టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ కృషి చేసిన సంగతి తెలిసిందే.
రేపు జరగబోయే మున్సిపల్ పోలింగ్ లో కార్ గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌కి పట్టం కట్టాలని ప్రజలందరికీ టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా తరపున సౌత్ ఆఫ్రికా టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల గారు కోరారు.