Home / MOVIES / రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?

రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?

లాక్‌డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ గ‌త కొద్ది రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, ఆయ‌న‌తో క‌లిసిన వారికి కూడా కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్నాయంటూ ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వ‌ర్మ స‌ద‌రు వెబ్‌సైట్‌కి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చాడు.

త‌న‌ ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వ‌రం వ‌చ్చింద‌ని ప్ర‌చారం అవుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. వ‌రుస సినిమాలు చేస్తున్నా. సీరియ‌స్‌గా వ‌ర్క‌వుట్స్ కూడా చేస్తున్నా.

ఫ్రెండ్స్ మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌రుస్తున్నందుకు క్ష‌మించండి అంటూ ఆర్జీవి త‌న ట్వీట్ ద్వారా కౌంట‌ర్ ఇచ్చాడు. మొత్తానికి వ‌ర్మ తాను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్న‌ట్టు గాసిప్ రాయుళ్ళ‌కి చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌, థ్రిల్ల‌ర్‌, మ‌ర్డ‌ర్‌, దిశా, 12 ఓ క్లాక్ ,డేంజ‌ర‌స్ అనే చిత్రాలు చేస్తున్నారు.