బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కరోనా బారినపడింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పుట్టింట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే దీపిక కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఆమె తండ్రి, మాజీ షట్లర్ ప్రకాశ్ పదుకొణెకు జ్వరం తగ్గకపోవడం వల్ల ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.