దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది.
ఇందులో 3,09,74,748 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,26,290 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 4,11,076 యాక్టివ్ కేసులున్నాయని.. టీకా డ్రైవ్‌లో భాగంగా 48,93,42,295 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.