Home / NATIONAL / దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 38,667 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,30,732 మృతిచెందారు.

శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 478 మంది మరణించగా, మరో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని తెలిపింది.

దేశవ్యాక్తంగా 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. కాగా, శుక్రవారం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితోపోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువ.