దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289కు చేరింది. ఇందులో 3,99,778 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,20,63,616 మంది బాధితులు కోలుకున్నారు.
మరో 4,39,895 మంది కరోనా వల్ల మృతిచెందారు. ఇక గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 34,791 మంది బాధితులు కోలుకోగా, 366 మంది కన్నుమూశారు. కాగా, కరోనా రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నదని తెలిపింది.
ఇప్పటివరకు మొత్తం 67,09,59,968 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది.కాగా, దేశంలో గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 32,097 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా 188 మంది మరణించారని తెలిపింది. 1,74,307 మందికి పరీక్షలు చేయగా 32 వేల మందికి పాజిటివ్ వచ్చిందని, పాజిటివిటీ రేటు 18.41గా ఉందని వెల్లడించింది.