Home / NATIONAL / రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ

రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ

వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సోమ‌వారం ఇచ్చిన భార‌త్ బంద్ పిలుపున‌కు రైతు సంఘాలు, ప్ర‌జా సంఘాలు స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయి.

రైతుల నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు పలుకుతూ న‌రేంద్ర మోదీ స‌ర్కార్ దోపిడీ విధానాల‌ను అనుస‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు.రైతులు అహింసా మార్గంలో స‌త్యాగ్ర‌హం సాగిస్తుంటే ఈ దోపిడీ స‌ర్కార్ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈరోజు భార‌త్ బంద్ చేప‌ట్టాల్సి వ‌చ్చింద‌ని రాహుల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆందోళ‌న చేప‌ట్టిన అన్న‌దాత‌ల‌కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ‌వ్యాప్తంగా స‌మ్మెలో పాల్గొనాల‌ని రాహ‌ల్ కోరారు.