దేశంలో కొత్తగా 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కు చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకోగా, 4,48,817 మంది బాధితులు మృతిచెందారు. మరో 2,70,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 199 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక గత 24 గంటల్లో 25,930 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 244 మంది చనిపోయారని తెలిపింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 13,217 కేసులు ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో మరో 121 మంది కరోనాకు బలయ్యారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 90,51,75,348 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.