ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గురువారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలవనున్నారు
. వీరిద్దరి మధ్య ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వక లంచ్ భేటీ జరగనుంది. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.