దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి.
కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.