తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్నం పెడితే, బీజేపీ సున్నం పెడుతోందని ఆమె ఆరోపించారు.
రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని ఆమె విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దేశ సంపదను అమ్మడంలో బీజేపీ నెంబర్ వన్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపికను, సహనాన్ని చేతకాని తనంగా భావించొద్దని కవిత స్పష్టం చేశారు.