Home / NATIONAL / PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?

PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌  లో చేరనున్నారా? .. దేశంలో రానున్న రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.నిన్న  శనివారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు   సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో పీకే సమావేశమయ్యారు.

రెండేళ్ల  తర్వాత అంటే 2024 ఎన్నికల వ్యూహంపై ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీలో చేరేందుకు పీకే అంగీక రించారు. పార్టీ సీనియర్‌ నేతలు సైతం ఆహ్వానించా రు. వ్యూహకర్తగా కన్నా.. పార్టీ నేతగానే పనిచేయాలని కోరారు. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ నాయకత్వానికి పీకే సూచించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 370 లోక్‌సభ సీట్లపై దృష్టి సారించాలని, మిగతా స్థానాలను మిత్రపక్షాలకు అప్పగించాలని సలహా ఇచ్చారు.

పార్టీ సమాచార విభాగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు మీడియా వ్యూహాన్ని మార్చాల్సిన అవసరముందని చెప్పినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కాంగ్రెస్‌ నేతలతో పీకే చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున్‌ ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ్‌సింగ్‌, అజయ్‌ మాకెన్‌, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat