దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు.
కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు, రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. అంతే కాకుండా మున్సిపల్ చట్టాల ప్రకారం ఫైన్ కూడా విధించవచ్చు.