దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.
