దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారు సగర్వంగా జీవించేలా సీఎం కేసీఆర్ చేస్తున్నారని వెల్లడించారు.
ములుగు జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలను మంత్రి సత్యవతి పంపిణీ చేశారు. అంతకుముందు ములుగులోని గట్టమ్మ ఆలయంలో, తాడ్వాయిలోని మేడారం సమ్మక్క సారలమ్మలకు దర్శించుకుని అమ్మవార్లకు బతుకమ్మ చీరలను సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.