తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత.. సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు.