Home / EDITORIAL / దేశంలో చైతన్యం కోసం BRS

దేశంలో చైతన్యం కోసం BRS

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి చేస్తున్న తరుణంలో తెలంగాణ వైపు కొన్ని విద్వేషపు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశ ఔన్నత్యం పటిష్టతను కాపాడే అవకాశం కేసిఆర్ తో మనకు వచ్చింది. దేశం వెనక్కి వెళ్ళే తరుణంలో ముందుకు నడిపించడానికి ఇప్పుడు మనతో కేసిఆర్ ఉన్నాడనే దైర్యం ఉంది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన యోధుడు మన కేసిఆర్. దేశానికి నిజమైన చైతన్యం తేవడానికి సకల జనులను కలుపుకుని సిద్దం అవుతున్నాడు.

దేశానికి నిజమైన స్వాతంత్ర్యము రాబోతున్నది.విద్వేషపూరిత వాతావరణంలో నుండి గొప్ప బాధ్యత కలిగే వాతావరణంలోకి దేశం అభివృద్ధి తో అడుగులు పడ్డాయి. దుర్మార్గుల పాలనను అంతం చేయడానికై మూర్ఖుల చెరసాల నుండి దేశాన్ని రక్షించడానికి జాతి జనులను ఐక్యంగా ఉంచడానికి గొప్ప లక్ష్యాలతో ఎత్తిన జెండా ఇది. ఈ జెండాకు ఉన్న పౌరుషం అంతాఇంతా కాదు. ఆనాడు తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసింది. ఈనాడు దేశ ప్రజలందరినీ ఏకం చేయడానికి పొలికేక పెట్టింది. రాష్ట్ర పార్టీ నుండి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన కానీ ఆ జెండా లక్ష్యం ఒక్కటే ప్రజలందరి సంక్షేమమే. ఈ జెండా ఆత్మ గౌరవ భావుట నుండి గొప్ప గొప్ప లక్ష్యాల నుండి అనేకనేక భావాల నుండి ఉద్భవించిన భారత ప్రజల జెండా ఇది! ఈ జెండా దేశ ప్రజలను జాగృతం పరుస్తుంది.

ఈ జెండా రేపటి భవిష్యత్ తరాలకు మార్గాలను చూపుతుంది. ఈ జెండా మన అస్తిత్వం. ఈ జెండా మన ఆత్మగౌరవం ఈ జెండాకు ఉన్న ఎజెండాతో సమరానికి సిద్దమై ఇప్పుడు ద్రోహులను తరమడానికి యుద్దాన్ని చేయడం అనివార్యం అయ్యింది. కొందరి మౌనాలు మౌనాలు కాదు. మహ విస్పోటనాలు చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు. వ్యవస్థ కోసం ఆరాటపడతాడు. ఒక్కడిగానే వస్తాడు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రజల గుండెల్లో నిలుస్తాడు. చరిత్ర సృష్టించే తీరుతాడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. ఈ చరిత్ర ఉన్నన్ని రోజులు జీవిస్తాడు.
అలాంటి వాళ్ళు ద్రోహులకు అర్దం కారు అర్ధమైతే వదులుకోరు. ఆరాధిస్తారు. హృదయంలో నిలుపుకుని కొలుచుకుంటారు. ఇప్పుడు దేశానికి అలాంటి నాయకుడు తోడయ్యాడు. అతని ఆలోచనలు నిత్య నూతనం. అతనితో ఉండేవాళ్ళు రాబోవు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు. బానిస పంధాలను తలవంచి అనుకరించరు. అలా ఎన్నటికీ బతకరు. పోని అని అన్యాయపు పోకడలు సహించరు. ఈ వ్యవస్థ వారికే ఆహ్వానం పలుకుతుంది!

¶ ఎందుకిప్పుడే బీడు భూములు పంట పొలాలుగా మారాయి?
¶ ఎందుకిప్పుడే రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది?
¶ ఎందుకిప్పుడే చెరువులు బావులు నిండుగా కనిపిస్తున్నాయి?
¶ ఎందుకిప్పుడే అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి?
¶ ఎందుకిప్పుడే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది?
¶ ఎందుకిప్పుడే రైతన్నల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి?
¶ ఎందుకిప్పుడే మనవాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి?
¶ ఎందుకిప్పుడే తెలంగాణ యాస సినిమాల్లోకి వచ్చింది?
¶ ఎందుకిప్పుడే నల్గొండలో ఫ్లోరైడ్ నీళ్ళ పీడ పోయింది?
¶ ఎందుకిప్పుడే బతుకు దెరువు వలసలు ఆగిపోయాయి?
¶ ఎందుకిప్పుడే కళాకారులు గుర్తించబడుతున్నారు?

ఇలా చెప్పుకుంటే పోతే కోకొల్లలుగా ఉన్నాయి. అరవై, డెబ్బై ఏళ్లుగా జరగని అభివృద్ది కళ్లముందే నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి.

ఎందుకంటే?
•••••••••••••••••

బాధ్యత గల లక్ష్యంతో చేసిన పోరాట ఫలితమే. భవిష్యత్ తరాలకు మార్గాలను నిర్మించేందుకు. చరిత్ర పుటల్లో నిలిచేందుకు. మేధావులు, విద్యావంతులు ఇంతకుముందు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటు దేశంలో నెలకొన్న అనిచ్చితిని గురించి పెదవి విప్పాల్సిన గొప్ప భాధ్యత మన మీద ఉన్నది.
మన దేశం భిన్నత్వంలో ఏకత్వం!
(అవును హిట్లర్ ఇంకా బతికే ఉన్నాడు మతోన్మాద ముసుగులో కొన్ని ఖరీదైన వేషాల వస్త్రాలలో) సర్వమత సమ్మేళనమే నా దేశం
భిన్నత్వంలో ఏకత్వం నా దేశం
త్యాగాల పునాదులపై ఏర్పడి
అందరినీ ఏకతాటిపై తెచ్చి
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం.నువ్వు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా ఫలాలు ప్రజాస్వామ్య దేశంలో మతాలతో రాజకీయం చేసే హక్కులేదు. ఉండకూడదు కూడా! మనుషులుగా బతకాలి
మానవత్వ విలువలతో బతకాలి. గొప్పగా పాలించాలి
దేశ అభివృద్ది కోసం పాటుపడాలి. సర్వ జనుల కలయిక కదా భారత దేశం అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య
లౌకిక గణతంత్ర దేశం
నా భారత దేశం విడదీస్తూ పాలించే అధికారం ఎవరికి లేదు. ప్రజలందరి శ్రేయస్సు కోరే పాలనే జరగాలి.
జెండా ఎగరేసినప్పుడే
వెల్లివిరిసే దేశభక్తులకు
ఏం తెలుస్తుంది
ఈ దేశ చరిత్ర!

నిజాలు అవసరం నా దేశంలోని యువతకు!

◼️ ఫేక్ న్యూస్ యూనివర్సిటీని డిజిటల్ ఇండియా అనే పేరుతో కేవలం భారతదేశంలోనే స్థాపించి మతం అనే మత్తుమందు ద్వారా యువతను వాడుకుంటున్నారు అంతే.

◼️ అభివృద్ది అనేది మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం ద్వారా ఫలించదు.

◼️ నా దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సామాజిక అంశం మీద స్వేచ్ఛ, స్వాతంత్రం పొందకుండా చేస్తున్న ఆ మతపార్టీనీ రాజకీయం చేయకుండా సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఈ దేశ యువతపై ఎంతగానో ఉంది.

◼️ మతం అనే పునాదుల్లో ఒక గొప్ప భారతాన్ని ఎన్నటికీ నిర్మించలేరన్నది వాస్తవమైన నిజం. మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తూ దేశాన్ని ఏ అంతరాలు లేని దేశంగా మార్చడం కష్టం. ఏకతాటిపైకి తెస్తానని ఎన్నెన్ని బహిరంగ స్పీచ్ లు ఇచ్చిన ప్రయోజనం లేదని గ్రహిస్తే దేశం ముందుకుపోతుంది.

◼️ మరణాన్ని కూడా ఆపలేని మతం కోసం మనుషులుగా బతకడం మరిచి ఎన్ని పదవులు అధికారాలు అనుభవించిన అవన్నీ వ్యర్థమే.

◼️ మతం అనే ఆయుధంతో నిన్ను రాజకీయాల కోసం ఒక బానిసగా వాడుకుంటున్నారు అంతే. ఇక్కడ వాళ్ళు చేసేది నీతో రాజకీయమే అని తెలుసుకో చాలు దేశంలో మార్పు మొదలవుతుంది.

◼️ ఏ ఒక రంగుతో ఒక అందం ప్రకాశం చెందదు. కొన్ని రంగుల కలయికతో దానికి కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. అలాగే నా దేశంలో అన్ని రకాల మనుషులు తమ తమ వృత్తులలో, మతాలతో,వారి వారి సంప్రదాయాలు,ఆచారాలలో దేశానికి అందంగా నిలుస్తారు.

◼️ ఆంగ్లేయులు అనుసరించిన విభజించు – పాలించు అనే విధానాన్ని మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకా నా దేశం శాంతిని ఏ విధంగా నెలకొల్పుతుంది అల్లర్లు సృష్టించేది మీరే రెచ్చగొట్టేది మీరే అయినప్పుడు.

◼️ ఇకనైనా నిజాలను అన్వేషించండి దేశం కోసం దేశంలో శాంతిని నెలకొల్పే విధంగా గొప్ప సందేశాన్ని ఈ జాతికి ఇద్దాం. బతికున్నప్పుడే జీవించి ఉండే పనులుచేసి మరణిద్దాం!

జై భారత్ జై బీ ఆర్ ఎస్

కళ్లెం నవీన్ రెడ్డి
వ్యాసకర్త

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri