ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల మరియు కార్మికుల సంక్షేమం కోసం భారత రాష్ట్ర సమితి పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ సమావేశం మరియు నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో 2023 సంవత్సర డైరీని ఆవిష్కరిస్తూ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేయడం జరిగినది .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ నూతన జిల్లా అయిన నాగర్ కర్నూల్ లో నిరుద్యోగ యువత కోసం త్వరలో జాబ్ మేళా పెడదామని , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను గౌరవ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారితో మాట్లాడి జిల్లా కేంద్రంలో పెడతామని నూతన కంపెనీలు జిల్లాకు వచ్చే విధంగా కృషి చేస్తామని మరియు ప్రైవేటు ఉద్యోగులకు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగినది.
సంగం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రైవేటు ఉద్యోగులు కార్మికులు ఐక్యతతో ఉంటూ తమ సంక్షేమ కోసం హక్కుల కోసం కృషి చేస్తూనే భారత రాష్ట్ర సమితి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ప్రైవేటు ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని వాటి పరిష్కార దిశగా సంఘం తోడ్పడుతుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మూర్తి యాదవ్, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జీ మోహన్ నాయక్, కార్యవర్గ సభ్యులు కార్తీక్ ముదిరాజ్, కళ్యాణ్,జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాం, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, కార్యదర్శి బైరెడ్డి వెంకటరెడ్డి సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి చారకొండ సత్యం, మహేష్ మొదలగు వారు పాల్గొన్నారు.