Site icon Dharuvu

టీఎస్పీఎస్సీ రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ”
–> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం
–> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు
–> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే మళ్లీ రద్ధు అయిన పరీక్షలను నిర్వహిస్తాం
–> ఈ నాలుగు పరీక్షలకు సంబంధించి మొత్తం కోచింగ్ మెటీరియల్స్ ను ఆన్ లైన్ లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతాం
–> రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోచింగ్ కేంద్రాలను బలోపేతం చేసి రీడింగ్ రూమ్స్ ను ఇరవై నాలుగంటలు తెరిచేలా ఆదేశాలిస్తాం.. అంతేకాకుండా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తాం
–> గతేనిమిది సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసిన కమీషన్ టీఎస్పీఎస్సీ
–> ఈ కమిషన్ ద్వారా ముప్పై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసిన కానీ ఏనాడూ కూడా అవినీతి ఆరోపణలు ఎలాంటి తప్పులు జరగలేదు
–> దాదాపు ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలను నిర్వహించిన ఏకైక కమిషన్ టీస్పీఎస్సీ
–> టీఎస్పీఎస్సీ ద్వారా 155 ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల అయ్యాయి
–> పరీక్ష పేపర్లు లీకేజీ లో ఎంతటి వారున్న కానీ వదిలిపెట్టేది లేదు.. వాళ్లందర్ని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం
–> ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చింది
ఇలాంటి పరిణామాలు మళ్లీ మళ్లీ పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

Exit mobile version