తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు గవర్నర్ తమిళసైని శనివారం ఉదయం కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ C ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేశారు.
గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్,మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచదర్, విఠల్ తదితరులు ఉన్నారు.
మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో 9 మంది నిందితులను సిట్ అధికారులు నేటి నుంచి 6 రోజులపాటు కస్టడీకి తీసుకోనున్నారు.