Home / SLIDER / ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 27వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు బిహెచ్ఇఎల్ విస్టా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టవలసిన పనులు తెలుసుకున్నారు. కాగా కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే భూగర్భడ్రైనేజీ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.

సీసీ రోడ్లు, కమిటీ హాల్, పందుల బెడద, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. వాటిపై ప్రత్యేక దృష్టి వహించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈలు నాగేశ్వర్ రావు, సురేందర్ నాయక్, మేనేజర్ రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, నదీమ్ రాయ్, కాలనీ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ పరిశోధన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ మురళీధర్ రెడ్డి, ట్రెజరర్ నవీన్ రెడ్డి, ఆర్గనైజర్లు కృష్ణ కిషోర్, మురళీకృష్ణ, అడ్వైజర్లు విశ్వనాథ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri