Home / SLIDER / మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

మహిళల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారని, మాది మహిళా పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు. మంగళవారం రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం మంత్రి సత్యవతి రాథోడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని వారు అభినందించారు. శ్రీమతి నీలిమా చౌదరి నేతృత్వంలోని మహిళ ప్రతినిధి బృందం త్వరలో మంత్రి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఒక ప్రతిపాదనను అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య మరియు అట్టడుగు వర్గాల్లోని వయోజన మహిళలకు నైపుణ్యం కల్పించి, వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా మరియు స్వావలంబనగా మార్చడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం ఇంతలా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలసి తాము పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఆస్ట్రేలియన్ మహిళ ప్రతినిధుల బృందం తెలిపారు.

అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యవతి గారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో మహిళ విద్యపైనే కాకుండా, వారి ఆరోగ్యం, రక్షణ, పోషణ, ఆర్థిక స్వావలంబన, రాజకీయ స్వతంత్రత కోసం ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా నిలించిందన్నారు. గౌరవ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి 35700 అంగన్‌వాడి కేంద్రాల ద్వారా 2015 జనవరి నుండి ఆరోగ్యలక్ష్మి పథకం క్రింద పోషక ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. గర్భిణీలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కెసిఆర్ కిట్ అందజేస్తున్నామన్నారు. అనంతరం ఆస్ట్రేలియన్ మహిళా ప్రతినిధుల బృందం ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారికి జ్ఞాపికను అందజేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri