తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ & టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీ లో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో జరగనున్న ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా వేంసూర్ మండలములో జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి, కల్లూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన స్టేడియం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో టూరిజం ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డేవిడ్ రవికాంత్ దత్త రాజ్ గౌడ్ చంద్రయ్య ES లు సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.