కర్ణాటక లో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపుతూ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఐదు దఫాల్లో 219 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గురువారం తెల్లవారుజామున మిగిలిన ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితను వెల్లడించింది.
తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో సిద్లఘట్టా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వీ మునియప్పకు మరోసారి టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో బీవీ రాజీవ్ గౌడను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో మహమ్మద్ షాలమ్ (రాయ్‌చూర్), ఎస్ ఆనంద్ కుమార్ (సీవీ రామన్ నగర్), హెచ్‌పీ సిద్ధర్ గౌడ (అర్కాల్‌గుడ్), ఇనాయత్ అలీ (మంగళూర్ సిటీ నార్త్)కు సీట్లు కేటాయించింది.