ఢిల్లీ మేయర్‌గా అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో.. షెల్లీకి లైన్ క్లియర్ అయ్యింది.
ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత ఢిల్లీకి కొత్త మేయర్ వచ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయర్ పదవిని రొటేషన్ చేస్తారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
మూడు కార్పొరేషన్లను ఎంసీడీ పేరుతో ఒక్కటిగా చేశారు. వార్డుల సంఖ్యను 272 నుంచి 250కి కుదించారు. స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఓటింగ్ నుంచి తప్పుకున్నట్లు శిఖా రాయ్ తెలిపారు.