తెలంగాణ బీజేపీ బహిష్కృత నేత .. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. గత కొన్ని రోజులుగా తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
‘నేను టీడీపీలోకి వెళ్లడం లేదు. టీడీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీడీపీ నేతలతో చర్చలు జరపలేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా’ అని స్పష్టం చేశారు. కాగా రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.