Home / HYDERBAAD / హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐటీ కారిడార్‌ లో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌ -2 ఫ్లైఓవర్‌ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.

అందుకోసం అధికారులు రూట్‌ మ్యాప్‌ ను విడుదల చేశారు

ఔటర్‌ రింగ్‌రోడ్‌ నుంచి హఫీజ్‌పేట్‌కు వెళ్లాల్సిన వాహనదారులు శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌-మీనాక్షి టవర్స్‌-డెలాయిట్‌-ఏఐజీ ఆస్పత్రి- క్యూమార్ట్‌- కొత్తగూడ ఫ్లైఓవర్‌ ద్వారా హఫీజ్‌పేట్‌ చేరుకోవాలి.

లింగంపల్లి నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనదారులు గచ్చిబౌలి ట్రాఫిక్‌ పీఎస్‌- డీఎల్‌ఎఫ్‌ రోడ్‌- రాడిసన్‌ హోటల్‌- కొత్తగూడ మీదుగా కొండాపూర్‌ చేరుకోవాలి.

విప్రో జంక్షన్‌ నుంచి ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ వెళ్లే వాహనాలను ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌- లెఫ్ట్‌ టర్న్‌- గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్‌- డీఎల్‌ఎఫ్‌ రోడ్‌- రాడిసన్‌ హోటల్‌- కొత్తగూడ ఫ్లైఓవర్‌, ఆల్విన్‌ వైపు అనుమతిస్తారు.

టోలీచౌకీ నుంచి ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌- మైండ్‌స్పేస్‌ జంక్షన్‌- సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌- లెఫ్ట్‌ టర్న్‌ హైటెక్స్‌ సిగ్నల్‌- కొత్తగూడ జంక్షన్‌ ద్వారా ఆల్విన్‌ వైపు వెళ్లాలి.

టెలికామ్‌ నగర్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లాల్సిన వాహనదారులు గచ్చిబౌలి అండర్‌ ఫ్లైఓవర్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని- శిల్పా లే అవుట్‌ ఫ్లైఓవర్‌ బస్టాప్‌ పక్క నుంచి- మీనాక్షి టవర్స్‌- డెలాయిట్‌- ఏఐజీ ఆస్పత్రి- క్యూ మార్ట్‌- కొత్తగూడ ద్వారా కొండాపూర్‌ చేరాలి.

బస్సులూ ప్రత్యామ్నాయ మార్గాల్లోనే..

ట్రాఫిక్‌ మళ్లింపుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సుల రాకపోకలు కొనసాగుతాయని టీఎస్‌ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వెళ్లే 216కే బస్సు రాడిసన్‌ హోటల్‌ Xరోడ్‌ నుంచి మీనాక్షి టవర్‌, ఐకియా, బయో డైవర్సిటీ Xరోడ్‌ మీదుగా వెళ్తుందన్నారు.

మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి మంచిరేవులకు వెళ్లే 221బస్సు రాడిసన్‌ హోటల్‌ నుంచి డీఎల్‌ఎఫ్‌, ఐఐఐటీ Xరోడ్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా, సికింద్రాబాద్‌ నుంచి వేవ్‌రాక్‌కు వెళ్లే 10హెచ్‌డబ్ల్యూ బస్సు డీఎల్‌ఎఫ్‌, ఐఐటీ Xరోడ్‌, విప్రో సర్కిల్‌ మీదుగా రాకపోకలు సాగించనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat