Home / SLIDER / కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ (TS STEP) నేతృత్వంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్ అయ్యింది.ఈ “మెగా జాబ్ మేళా”ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాకు 4725 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 269 మందిని వివిధ కంపెనీలు స్పాట్ లో రిక్రూట్ చేసుకున్నాయి. 1458 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. స్పాట్ లో ఉద్యోగాలు పొందిన వారికి మంత్రులు, ఎమ్మెల్యే గారు నియామక పత్రాలు అందజేశారు.

ఈ మెగా జాబ్ మేళాలో ట్రాన్స్‌జెండర్లు కూడా హాజరై ఇంటర్వ్యూల్లో పాల్గొనగా ఇద్దరు ఉద్యోగాలు పొందారు. ముగ్గురు వికలాంగులు ఉద్యోగాలు పొందారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 18 జాబ్ మేళాలు నిర్వహించటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారి కృషితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. సాఫ్ట్‌వేర్, బీపీవో, ఫార్మా, రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నిరుద్యోగ యువతకు వారి అర్హతలకు తగ్గట్లుగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన 18 జాబ్ మేళాలలో 97 వేల 19 మంది నిరుద్యోగ యువత TS STEP కు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి 30,902 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలను కల్పించి నియామక పత్రాలు అందజేశామని అన్నారు. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి కనిష్టంగా నెలకు రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.80 వేల వరకు వేతనాలు అందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో త్వరలోనే 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వెల్లడించారు.

మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ.. నిరుద్యోగులు జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు పూర్తయిన తర్వాత సమయాన్ని వృధా చేయకుండా ఉద్యోగంలో స్థిరపడాలని అన్నారు. ఇలాంటి మెగా జాబ్‌ మేళా నిరుద్యోగులకు ఓ సువర్ణ అవకాశమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ.. 118 కంపెనీలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రద్ధాసక్తులతో విద్యాభ్యాసం పూర్తి చేసి భవిష్యత్‌పై ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ పడాలన్నారు. సమాజంలో చిన్న చూపు చూడబడుతున్న ట్రాన్స్‌ జెండర్లు ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం సత్ఫలితాలిస్తాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సెట్ విన్ ఎండి వేణు గోపాల్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat