Breaking News
Home / SLIDER / వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు, డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారు, కార్పొరేటర్ సుజాత గారితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేద ప్రజల వద్దకే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నేటికి 24వ బస్తీ దవాఖాన ఏర్పాటుతో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వంద బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషించ దగ్గ విషయం అన్నారు.

గతంతో పోల్చితే బస్తీ దవాఖానల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద ఆసుపత్రుల్లో రోగుల ఒత్తిడి తగ్గిందన్నారు. అసెంబ్లీ వేదికగా అడిగిన వెంటనే 10 బస్తీ దవాఖానల ఏర్పాటుకు సహకారం అందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి ప్రజల తరపున ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ నిర్మల, ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino