Breaking News
Home / SLIDER / రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్‌, బ్లాక్‌మెయిలర్‌

రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్‌, బ్లాక్‌మెయిలర్‌

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ..మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్‌, బ్లాక్‌మెయిలర్‌ అని విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. డయాలసిస్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

జడ్చర్ల అద్దంలా మెరిసిపోతుందని అన్నారు. ఈ అభివృద్ధిని చూసి కొంతమంది మూర్ఖులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా విలువను రేవంత్‌ రెడ్డి తగ్గిస్తున్నాడని సీరియస్‌ అయ్యాడు. రేవంత్‌ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాల్లేనని అన్నారు. రాజకీయాలను ఆయన భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అసలు మిడ్జిల్‌కు ఏం చేశాడో రేవంత్‌ రెడ్డి చెప్పాలని నిలదీశారు. బీజేపీ నాయకులు తమ కల్లోలాలు రేపి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino