కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రగతి నగర్ లో వీర్ భగత్ సేవక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ చల్లా ఇంద్రజిత్ రెడ్డి, ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, చల్లా సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.