కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 71వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్ లలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు.
ఈ మేరకు రోడ్డు ప్యాచ్ వర్క్ ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న అధికారులకు అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాపయ్య యాదవ్ నగర్ లో 100 శాతం అన్నీ పనులు పూర్తైన నేపథ్యంలో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, నార్లకంటి బాలయ్య, యాదవ రెడ్డి, రమణ రావు, పాపి రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజన్న, అయుబ్, హీరాలాల్, భవనారాయణ, నర్సింహా రెడ్డి, శాంతికుమార్, రామ్మోహన్ రావు, వెంకట్ రావు, తిరుమల్ రావు, ప్రవీణ్, సత్యనారాయణ, జయంచారి, మధుకర్ రెడ్డి, అజయ్, వెంకటేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.