Breaking News
Home / SLIDER / కొంపల్లిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కొంపల్లిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డ్ జయభేరి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 72వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం అక్కడక్కడా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ సమస్య, వరదనీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే గారిని కోరగా.. అక్కడే ఉన్న అధికారులకు వరద సమస్య లేకుండా నాలా నిర్మాణానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేసి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్ సువర్ణ, మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు జిమ్మి దేవేందర్, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, వేణు యాదవ్, మహిళా నాయకురాలు సంగీత, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino