Home / SLIDER / ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫక్షన్ హలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవలలో భాగంగా పోలీస్ శాఖ, పోలీస్ కమిషనర్ ఏవి రంఘనాథ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలీస్ వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్నత ఆలోచనలతో ఫ్రెండ్లి పోలిసింగ్ విధానాన్ని తీసుకువచ్చి ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను సైతం ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమై ఉందని అన్నారు. మహిళల భద్రత విషయంలోనూ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తు మహిళలను వేధింపులకు గురి చేసే ఆకతాయిల భరతం పట్టేందుకు షీ టీంలను ఏర్పాటు చేసి వారికీ పూర్తి స్థాయి భద్రతను అందిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట నిర్ణయాల వల్ల అరాచక శక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ పోలీసులు ఉన్నారని తెలిపారు. దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణలతో హైదరాబాద్ లో పోలీస్ కామాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా సాంకేతికంగా పోలీసులకు సక్లిష్టమైన కేసులను సైతం పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్గారి నాయకత్వంలో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టడం వల్లే నేడు రాష్ట్ర భద్రత అద్భుతంగా ఉందని తెలిపారు. గత 7సంవత్సరాలలో పోలీస్ శాఖలో 28వేల 277ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా అదనంగా 17వేల 516ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, అడిషనల్ డీసీపీ సంజీవ్, మామునుర్ ఏసిపి కృపాకర్, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సిఐలు, ఎస్సైలు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat