Breaking News
Home / SLIDER / కేసీఆర్ సుపరిపాలనలో తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తున్నాయి:ఎంపీ రవిచంద్ర

కేసీఆర్ సుపరిపాలనలో తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తున్నాయి:ఎంపీ రవిచంద్ర

సురక్షా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన ర్యాలీ కి ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు .తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉండడం, ముందుకు సాగడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన పథకాలు,కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఖమ్మం నగరంలో ఆదివారం సురక్షా దినోత్సవం (పోలీసు డే) ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ SR&BGNR కాలేజీ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్స్,జెడ్పీ సెంటర్,చర్చి కాంపౌండ్, గాంధీ చౌక్,జూబ్లీ క్లబ్ మీదుగా సిటీ బస్టాండ్ సెంటరు వరకు కొనసాగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నాయని,అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు.కేసీఆర్ అన్ని కులాలు,మతాలను గౌరవిస్తూ సుపరిపాలన అందిస్తుండడంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని, ప్రగతిపథాన పరుగులు పెడుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు.రాష్ట్రాన్ని అన్ని రంగాలలో గొప్పగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పడడం ఖాయం అని ఎంపీ రవిచంద్ర ధీమాగా చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతం,నగర పోలీసు కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం,సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్,అదనపు పోలీసు కమిషనర్ రామోజీ రమేష్, నగరానికి చెందిన పోలీసు అధికారులు,సిబ్బంది,ప్రజలు జాతీయ జెండాలు చేబూని మండుటెండను సైతం లెక్కచేయకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino