Home / SLIDER / శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1…

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పేట్ బషీరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కాంప్లెక్స్” మరియు సూరారంలో నూతనంగా ఏర్పాటు చేసిన “సూరారం పోలీస్ స్టేషన్” ను ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ.. మేడల్చ్ జిల్లాలో కొత్తగా 9 పోలీస్ స్టేషన్ లు.. 2 డీసీపీ ఆఫీస్ లు.. 3 ఏసీపీ ఆఫీస్ లు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 60-70 పోలీస్ స్టేషన్ లు మాత్రమే ఉన్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్ లను ఇచ్చిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నూతన పోలీస్ స్టేషన్ లను ప్రారంభించుకుంటున్నామన్నారు. క్రైం రేట్ తగ్గించేందుకే నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రైం జరిగిన వెంటనే గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం వల్లే వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

సురారం పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ఈ పరిధిలో పూర్తిగా క్రైం రేట్ ను కంట్రోల్ చేసి నేర నియంత్రణలో పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అన్నారు. సైబరాబాద్ లోనే ఈ నూతన పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎదగాలని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలు పరిరక్షించడంలో దేశంలోనే టాప్ లో ఉన్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 అని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు పెద్దపీట వేస్తూ పోలీస్ యంత్రాంగానికి అధునాతన సదుపాయాలను సమకూరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డిసిపి డివి శ్రీనివాస రావు, మేడ్చల్ డీసీపీ సందీప్, ఏసీపీలు వెంకట్ రెడ్డి, రామలింగ రాజు, చంద్రశేఖర్ రెడ్డి, సూరారం ఎస్.హెచ్.ఓ ఎం.వెంకటేశ్వర్ రావు మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat