Breaking News
Home / SLIDER / స్వరాష్ట్రంలో నిరంతర వెలుగులు…

స్వరాష్ట్రంలో నిరంతర వెలుగులు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు షాపూర్ నగర్ లోని ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ విజయోత్సవ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వినియోగదారులు, రైతులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొనగా..గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పులు, విజయాలను ప్రత్యేక ఏవీ ద్వారా వీక్షించారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పుల ద్వారా తమకు జరిగిన మేలును వివరిస్తూ.. సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యుత్‌ రంగంలో తెలంగాణ అనేక విజయాలను సాధించిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుందో..? తెలియని దుస్థితి ఉండేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో.. ఇటు పంటలు ఎండిపోయి రైతులు, అటు పరిశ్రమలు మూతపడి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల బతుకు ఆగమైందన్నారు. కానీ స్వరాష్ట్రంలో గౌరవ సీఎం కేసీఆర్ గారు‌ తీసుకున్న చర్యలతో రాష్ట్ర విద్యుత్‌ రంగంలో సరికొత్త విప్లవం మొదలైందన్నారు.

ఏండ్లనాటి అంధకారాన్ని దూరం చేసుకొని వెలుగుల్లోకి వచ్చామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యుత్‌ ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చి వాటిని బలోపేతం చేయడంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు కరెంట్‌ కోతలు, వానకాలంలో వరదలు వస్తే కోతలు ఇలా ప్రజలంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారని, కానీ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్‌ సరఫరాల్లో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. చివరగా జూనియర్ లైన్ మెన్ గా విశిష్ఠ సేవలు అందిస్తున్న శిరీషను ఎమ్మెల్యే గారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈలు నర్సింహా రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, విద్యుత్ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat