రానున్న వర్షా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో జీ హెచ్ ఎం సీ ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేసిన మాన్సూన్ టీం వాహనాల బృందాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీ హెచ్ ఎం సీ తో పాటు జలమండలి వంటి అన్ని విభాగాల సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. కార్పొరేటర్ కంది శైలజ తో పాటు అధికారులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ పరిధిలో విద్యుత్ సేవలను ముమ్మరం చేయాలనీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. తెలంగాణా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డీ ఈ శ్రీధర్ నేతృత్వం లోని అధికారులు మంగళవారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. డిప్యూటీ డీ ఈ మహేష్, వివిధ సెక్షన్ల ఏ ఈ లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం విద్యుత్ రంగంలో గణనీయంగా పురోగమించిందని తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు గంటల కొద్దీ విద్యుత్ కోతల వల్ల ఇన్వర్టర్లు, జేనరేటర్ల పై జనం ఆధార పడాల్సి వచ్చిన పరిస్థితి తొలగి పోయింది.
నిరంతరం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్, ఎస్ సీ ఎస్టీ లకు 101 యూనిట్ ల వరకు ఉచిత్ విద్యుత్, నాయీ బ్రాహ్మణులూ, దోభీ ఘాట్, రజక వృత్తి దారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. ఇక సికింద్రాబాద్ పరిధిలో 400 కే వీ సామర్ధ్యం గల తొలి సబ్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ లో 2018 లో రూ.125 కోట్లతో ఏర్పాటు చేసుకున్నామని, అదే విధంగా నియోజకవర్గంలో 91 వేల మంది వినియోగదారులు 2014 లో ఉండగా వారి సంఖ్య ప్రస్తుతం 114351 కు చేరిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగణంగా సేవలు అందించాలని సూచించారు. సికింద్రాబాద్ పరిధిలో 210 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులను 2014 తరువాత్ విద్యుత్ రంగంలో చేపట్టామని, వాటి వివరాలు పౌరులకు తెలియచెప్పాలని సూచించారు.