తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన యువనేత.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్-వరంగల్ హైవేపై శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది.
దీంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కారులోని ఇతర వ్యక్తులకు కూడా గాయాలేమీ కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.