తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో “తెలంగాణ రన్” అట్టహాసంగా జరిగింది. ఈ రన్ కు ముఖ్య అతిథులుగా హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఐఎఎస్ గారు, జోనల్ కమిషనర్ మమత గారు, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ప్రముఖ సినీ నటులు విశ్వక్ సేన్, అశ్విన్, నటి నందిత శ్వేత తెలంగాణ రన్ లో పాల్గొని హుషారెత్తించారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన తెలంగాణ రన్ చింతల్ బస్టాప్ మీదుగా ఐడిపిఎల్ నుండి తిగిరి మున్సిపల్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ రన్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు సందీప్, శ్రీనివాస రావు, శ్రీనివాస్ రావు, ఏసీపీలు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గంగారాం, రామలింగ రాజు, డిసీలు మంగతాయారు, ప్రశాంతి, మున్సిపాలిటీ కమిషనర్లు శ్రీహరి, రామకృష్ణ రావు, సత్యనారాయణ, సీఐలు పవన్, ప్రశాంత్, క్రాంతి కుమార్, సుమన్, భాస్కర్, వెంకట్ రెడ్డి, నరహరి మరియు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.