ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా గురించి తెలియని వారు ఉండరు. బోల్డ్ లుక్ తో నెట్టింట రచ్చ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కాగా, తాజాగా నటి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించింది.
50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.షెర్లిన్ ఇటీవలే ముంబై బాంద్రా లోని ఓ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ నటిని చూసిన అభిమానులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా..? ’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నటి సానుకూలంగా స్పందించింది. ‘రాహుల్ గాంధీని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు. అందులో తప్పేముంది..?’ అంటూ అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది. అయితే, పెళ్లి విషయంలో కొన్ని షరతులు ఉంటాయని తెలిపింది. పెళ్లి తర్వాత తన ఇంటిపేరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అందుకు రాహుల్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.