తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో నిన్న సాయంత్రం గుండెపోటు తో అకాల మరణం చెందిన ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను లకడికపుల్ లో ఉన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు
.శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ గారి అన్నయ్య శ్రీ జహెద్ అలీ ఖాన్, శ్రీ జహీరుద్దిన్ అలీఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్ లను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
శ్రీ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారి అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జర్నలిజానికి, ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు చేశారని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకున్నారు.