తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది.
ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను వేశారు..
రేపు మనం పీల్చే గాలిపై కూడా పన్ను వేస్తారు.. జనం సైనికులై వైసీపీ ప్రభుత్వంపై తిరగబడాలి. ఈరోజు ఏపీ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు.. నేనోస్తున్నాను.. నేను మీ ముందు నడుస్తా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.