Home / ANDHRAPRADESH / లోకేష్‌ను పట్టించుకోని బీజేపీ పెద్దలు..ఇక కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ..!

లోకేష్‌ను పట్టించుకోని బీజేపీ పెద్దలు..ఇక కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ..!

ఏపీ స్కిల్ డెవప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో ములాఖత్ ద్వారా కలిసిన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరావేశంతో బయటకు వచ్చి.. ఇక టీడీపీతో మిలాఖత్ అయి వచ్చే జన్మలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాడు. దీంతో పక్కనే ఉన్న లోకేష్, బాలయ్య కూడా నోరెళ్లపెట్టారు..బీజేపీ కలిసి వస్తే..మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాం లేదంటే..బీజేపీతో తెగతెంపులకైనా సిద్ధం..నేనేమి కావాలని మోదీ దగ్గరకు వెళ్లలేదు..ఆయనే పిలిస్తేనే వెళ్లా అంటూ పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టడంతో లోకేష్ , బాలయ్య బిత్తరపోయాడు..ఇప్పటికే బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు నేతలు, పురంధేశ్వరీ ద్వారా మళ్లీ మోదీ ప్రాపకం కోసం పాకులాడుతున్న టైమ్‌లో పవన్ ఇలా బీజేపీతో పొత్తు తెంచుకుని అయినా టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో బాబు బ్యాచ్‌ వెన్నులో వణుకుపుట్టింది..

మోదీ అండ లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమని ఇప్పటికే చంద్రబాబుకు అర్థమైపోయింది..అందుకే చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ ఉన్నాడని..కొందరు టీడీపీ నేతలు అతి చేస్తున్నా..మా బాబుగారిని అరెస్ట్ చేయించే ధైర్యం జగన్‌కు లేదు..కచ్చితంగా ఇది కేంద్రంలోని బీజేపీ హస్తం ఉందని పచ్చమీడియా తన పైత్యాన్ని ప్రదర్శిస్తున్నా…నిప్పు నాయుడు, పప్పునాయుడికి మోదీని పల్లెత్తు మాట అనడానికి ఉచ్చ పడుతోంది..(లోకేష్ భాషలో)..పవన్ చెప్పాపెట్టకుండా టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించగానే పక్కనే ఉన్న చినబాబుకు చెమటలు పట్టాయి..ఎక్కడ మోదీకి కోపం వస్తే..పర్మినెంట్‌గా చిప్పకూడు తినాల్సిందనే భయంతో ….పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన మాకు సంబంధం లేదు…మేం చెప్పమని చెప్పలేదు..తనే ఆవేశంలో పొత్తు ప్రకటించాడు..అంటూ సంజాయిషీ ఇవ్వడానికి చంద్రబాబు తెల్లారే సరికి లోకేష్ ని ఢిల్లీకి పంపించాడు.

అయితే ఢిల్లీకి వెళ్లిన లోకేష్..నిన్నటి నుంచి బీజేపీ నేతల అపాయింట్‌మెంట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు…బీజేపీలో ఉన్న టీడీపీ నేతలతో లాబీయింగ్ చేయించినా..లోకేష్‌ను కలిసేందుకు బీజేపీ అగ్రనేతలు ఇష్టపడలేదు..దీంతో చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరిపిన లోకేష్ తన తండ్రిని ఎలాగైనా కేసుల నుంచి బయటపడేయండి..ఎంత ఖర్చు అయినా పర్లేదు అని సదరు లాయర్లకు మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఇక వైసీపీ రెబల్ ఎంపీ , చంద్రబాబు తొత్తు అయిన రఘురామ కృష్ణరాజుతో కలిసి లోకేష్ సుదీర్ఘ మంతనాలు సాగించిన లోకేష్..బీజేపీ పెద్దలతో తనకున్న పరిచయాలతో అపాయింట్‌మెంట్లు ఇప్పించమని అభ్యర్థించినట్లు సమాచారం.

చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న లోకేష్..మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి…బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది..అంతే కాదు..చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చేలా..టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పార్టీల నేతలు లోకేష్‌కు ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. ఇ

దే విషయమై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘చంద్రబాబుకు ఇండియా కూటమి సభ్యులు మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. ఆయన కుమారుడికి ఫోన్ చేస్తున్నారు. దీన్ని బట్టి టీడీపీ.. ఆ కూటమిలో భాగమని నిరూపితమవుతోందని. అధికారంలోకి రావడం, వీలైనంత దోచుకోవడమే వారి ఉమ్మడి వ్యూహం. ఎన్నికల్లో ఒంటరిగా పోరాడే ధైర్యం టీడీపీకి లేదు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ అగ్రనేతలు పెద్దగా స్పందించకపోవడం..ఇండియా కూటమి నేతలే చంద్రబాబుకు మద్దతుగా ఫోన్లు చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే..ఇక మోదీ ప్రాపకం కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు అన్నీ దారులు మూసుకుపోయాయని, ఇక చివరకు గత ఎన్నికల్లో లాగే తెలంగాణలో పోటీ చేసినట్లు మహాకూటమిలా జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడమే ఏకైక మార్గమని క్లియర్ గా అర్థమవుతోంది. మరి బీజేపీ పొత్తు కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయా..లేదా చివరకు ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తాడా అనేది చూడాలి.. ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ..మరోవైపు ఇండియా కూటమితో చీకటి రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లింది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat