భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యత వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వేడుకలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు.