ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని యాదగిరిగుట్టలో వెలుగు చూసిన సంఘటనలతో పోలీసు యాత్రంగం ముమ్మరంగా రాష్ట్రా వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అన్నింటిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడి చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వ్యభిచార గృహాలు నిర్వహించే మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘పడుపు వృత్తిని స్వచ్ఛందంగా మానేస్తున్నామని, ఎవరైనా విటులు వచ్చి బలవంత పెడితే పోలీసులకు అప్పగిస్తాం’అని వినూత్నంగా బోర్డు పెట్టారు.
