తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.రాష్ట్రంలో పలు విషయాల గురించి చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన మూడువేల కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. అయితే… డీపీఆర్ వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారని, అలాగే కొత్త జిల్లాలకు రోడ్ల అనుసంధానం కోసం ప్రతిపాదనలు ఇచ్చామని మంత్రి తుమ్మల తెలిపారు.