తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాసుపుస్తకాల నమూనాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులకు ఇచ్చే పాసు పుస్తకాలపై రైతు ఫొటో తప్ప మరెవరీ ఫొటో ఉండొద్దని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.రైతులకు ఇచ్చే కొత్త పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని ఈ సందర్భంగా సీఎం అధికారులకు చెప్పారు. కేవలం రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే పాసు పుస్తకంపై ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.