ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఆపన్నులకు చేరువ అయిన అంశాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా..ఎక్కడి నుంచైనా ఒక్క ట్వీట్ చేస్తే చాలు సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ తాను బిజీగా ఉంటే..ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ ఆన్‌లైన్‌లోనే కేటీఆర్ ఆఫీస్ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్‌ను ఏర్పాటుచేశారు.
see also : ఆ ఒక్కటే కేటీఆర్ ట్విట్టర్ రికార్డుకు కారణ..!
సమస్యలను తక్షణమే చేరవేస్తూ వాటికి పరిష్కారం చూపుతున్నారు. ఇలా సహాయం పొందిన వారిలో కేవలం తెలంగాణ వారే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కూడా ఉండటం విశేషం. టెక్నాలజీ అంటే కేవలం ఉన్నత వ్యక్తులు మాత్రమే వాడుకునే సాధనం కాదని…సామాన్యుల ఆకాంక్షాలను నెరవేర్చే వేదిక..వారితో మమేకం అయ్యే నూతన అవకాశం అని మంత్రి కేటీఆర్ నిరూపించారని నెటిజన్లు అంటున్నారు. తద్వారా యంగ్ జనరేషన్ లీడర్ అనేదానికి తార్కాణంగా నిలిచారు.
see also :రైతులకిచ్చే పాసుపుస్తకాలపై రైతు ఫొటో మాత్రమే ఉండాలి..సీఎం కేసీఆర్